
హరారే: ఆల్‌రౌండ్ ఆటతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ టీ20 ట్రై సిరీస్‌లో మరో భారీ విజయం అందుకుంది. టిమ్ సిఫర్ట్ (48 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్) మెరుపులతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ వన్‌సైడ్ మ్యాచ్‌లో తొలుత సఫారీ జట్టు 20 ఓవర్లలో 134/8 స్కోరు మాత్రమే చేసింది. రీజా హెండ్రిక్స్ (41), జార్జ్ లిండే (23 నాటౌట్) తప్ప మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు.
ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మిచెల్ శాంట్నర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం సిఫర్ట్ మెరుపులతో కివీస్ 15.5 ఓవర్లలోనే 135/3 స్కోరు చేసి గెలిచింది. సిఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్లూ ఇప్పటికే ఫైనల్ చేరాయి. సిరీస్‌లో మూడో టీమ్ జింబాబ్వేతో బుధవారం కివీస్ చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది.