Thug Life: స్టైలిష్ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా శింబు.. ‘థగ్‌‌ లైఫ్‌‌’ థర్డ్ సాంగ్ ఊరమాస్

Thug Life: స్టైలిష్ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా శింబు.. ‘థగ్‌‌ లైఫ్‌‌’ థర్డ్ సాంగ్ ఊరమాస్

కమల్ హాసన్‌‌  హీరోగా మణిరత్నం రూపొందించిన  చిత్రం ‘థగ్‌‌ లైఫ్‌‌’.శింబు కీలక పాత్ర పోషించగా త్రిష, అభిరామి హీరోయిన్స్‌‌.  జూన్ 5న పాన్ ఇండియా వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్  స్పీడ్ పెంచిన మేకర్స్.. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మంగళవారం (MAY27)  ‘థగ్‌‌ లైఫ్‌‌’ నుంచి మూడో పాటను విడుదల చేశారు. ఏ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్‌‌లో శింబు గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా కనిపిస్తున్నాడు.  ‘ఓ మార.. ఊర్లో సింహంలా.. సింపుల్‌‌గా, సింగిల్‌‌గా చిల్ అయ్యే సింబల్‌‌ రా..’అంటూ శింబు పాత్రను పరిచయం చేస్తూ సాగిందీ పాట.

ఆదిత్య ఆర్కే పాడిన విధానం, రాకేందు మౌళి అందించిన రాప్, అనంత శ్రీరామ్ రాసిన ఇంపాక్ట్‌‌ఫుల్ లిరిక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్‌‌ ఎన్ సుధాకర్ రెడ్డి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో  విడుదల కానుంది.