విటమిన్లు, ప్రొటీన్ల ఫుడ్ : ఓట్స్ ను ఇలా తినండి... కొలెస్ట్రాల్ ఉండదు..బరువు తగ్గుతారు..

విటమిన్లు, ప్రొటీన్ల ఫుడ్ : ఓట్స్ ను  ఇలా తినండి... కొలెస్ట్రాల్ ఉండదు..బరువు తగ్గుతారు..

ఈ మధ్యకాలంలో ఓట్స్ వాడకం ఎక్కువైంది. ఒకప్పుడు బరువు తగ్గడానికి ఉపయోగించే ఓట్స్... ఇప్పుడు అందరి మెనూలో వచ్చి చేరింది. విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఓట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లంతా తమ ఓటు ఓట్స్ కే అంటున్నారు. మరింకెందుకు ఆలస్యం... వెంటనే ఈ ఓట్స్ వంటలను మీరూ ట్రై చేయండి.

లెమన్ ఓట్స్ తయారీకి కావలసినవి

ఓట్స్ :1 కప్పు
నీళ్లు:  అర కప్పు 
ఉల్లిగడ్డ:  (పెద్దది) 
కరివేపాకు :1 రెమ్మ
 పచ్చిమిర్చి తరుగు : 2 టీస్పూన్లు 
అల్లం తరుగు: 1 టీస్పూన్
నిమ్మరసం: 1 టేబుల్ స్పూను
నూనె: సరిపడా
ఆవాలు: పావుటీస్పూన్​
జీలకర్ర: పావు టీస్పూన్ 
మినప్పప్పు :ఒక టిన్నర టీస్పూన్
 శనగపప్పు : 1 టేబుల్ స్పూన్ 
ఇంగువ: చిటికెడు 
పసుపు :అర టీస్పూన్
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: పావు కప్పు
వేగించిన పల్లీలు :2 టేబుల్​ స్పూన్లు

తయారీ  విధానం: ముందుగా స్టవ్ పై పాన్​ పెట్టి అందులో ఓట్స్​ను వేగించాలి. మరో పాన్​ లో  నూనెను వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు వేయాలి.  తర్వాత ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం తరుగు, ఇంగువ వేసి కలపాలి. అయిదు నిమిషాల తర్వాత పసుపు .. ఉప్పు కలపాలి. ఇప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. అందులో వేగించిన ఓట్స్ వేసి నాలుగు నిమిషాలు మూతపెట్టాలి. తర్వాత నిమ్మరసం వేసి మరో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు, పల్లీలు  వేసిదింపేయాలి.

 ఓట్స్​ ఖీర్​ తయారీకి కావలసినవి

ఓట్స్ :అరకప్పు 
పాలు: 3 కప్పులు 
చక్కెర అర కప్పు 
కుంకుమ పువ్పు చిటికెడు 
యాలకుల పొడి: పావు టీస్పూన్ 
బాదం, పిస్తా జీడిపప్పు : అన్నీ కలిపి పావుకప్పు 
ఎండు ద్రాక్ష (క్రిస్మస్) 1: టేబుల్ స్పూన్
 నెయ్యి: 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ముందుగా అన్ని డ్రై ఫ్రూట్స్ ను చిన్నచిన్నముక్కలుగా చేసి నెయ్యిలో వేగించాలి. ఇప్పుడు అడుగుభాగం మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి వేడిచేసి చిన్న మంటపై ఓట్స్​ వేగించాలి. తర్వాత అందులో పాలు, చక్కెర వేసి బాగా కలపాలి. నిమిషం తర్వాత డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, యాలకుల పొడి కూడా వేసి, ఒకసారి కలిపి గిన్నెను. దింపేయాలి. ఓట్ ఖీరను ఎక్కువసేపు. ఉడికించొద్దు. ఈ ఖీర్​ను వేడిగా లేదా చల్ల గానైనా సర్వ్​ చేయొచ్చు..