ఒబామా అసమర్థ అధ్యక్షుడు: ట్రంప్

ఒబామా అసమర్థ అధ్యక్షుడు: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తిట్ల వర్షం కురిపించారు. తీవ్ర అసమర్థ అధ్యక్షుడు ఒబామా అంటూ మండిపడ్డారు. సోమవారం వైట్ హౌస్ వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఒబామా అసమర్థ అధ్యక్షుడని చెప్పగలను. చాలా అసమర్థుడు”అని కామెంట్ చేశారు. కరోనాను అరికట్టడంలో ట్రంప్ సర్కారు తీసుకున్న చర్యలపై ఒబామా అంతకుముందు రోజు తీవ్ర విమర్శలు చేశారు. కాలేజీ గ్రాడ్యుయేట్లనుద్దేశించి ఒబామా చేసిన వర్చువల్ ప్రసంగంలో.. అమెరికా ప్రస్తుత నాయకత్వం కరోనాను కట్టడి చేసిన తీరుతోనే బయటపడిందన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందేనని, కనీసం వారికి పనిచేస్తున్నట్లుగా నటించడం కూడా చేతకాదని పేరు చెప్పకుండా ట్రంప్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒబామా విమర్శలు గుప్పించారు. దీనిపై మీడియా ప్రశ్నించగా ట్రంప్ పై విధంగా కామెంట్ చేశారు.