బీసీల గొంతు కోసి నట్టేట ముంచారు..స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అని చెప్పి 17 శాతమేంది?:లక్ష్మణ్

బీసీల గొంతు కోసి నట్టేట ముంచారు..స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అని చెప్పి 17 శాతమేంది?:లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ నీతిని అవలంబిస్తూ బీసీల గొంతు కోసిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలకు ముందు స్థానిక ఎలక్షన్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, ఇప్పుడు చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారిందని మండిపడ్డారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. 

పంచాయతీ ఎన్నికల్లో జీవో నంబర్ 46 తీసుకొచ్చి బీసీలను నిండా ముంచారని, కనీసం 20 శాతం కూడా ఇవ్వకుండా 17 శాతానికే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. కులగణన, సర్వేలు, అసెంబ్లీలో బిల్లులు అంటూ హడావుడి చేసి బీసీలను మైమరిపించారని ఫైర్  అయ్యారు. కులగణన సర్వే కోసం రూ.200 కోట్లు వృధా చేశారని విమర్శించారు.