నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

తుంగతుర్తి, వెలుగు: నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా రిటర్నింగ్ అధికారులు చూడాలని కలెక్టర్ తేజస్ నంద్‌‌లాల్ పవార్ అన్నారు. నూతనకల్ మండల పరిధిలోని ఎమ్మార్పీ భవనం మిర్యాల ,ఆత్మకూర్ ఎస్ మండల ఏపూరు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎస్పీ కే. నరసింహతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలోనికి అభ్యర్థులతో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు. 

వాహనాలు 100 మీటర్ల దూరంలో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్‌‌ ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి తప్పుల కు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అధికారులు విధులు నిర్వహించాలన్నారు.  గ్రామాల వారీగా స్వీకరించిన నామినేషన్ పత్రాలను వేర్వేరుగా భద్రపరచాలని అన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్ తహసీల్దార్ శ్రీనివాస్,  ఎంపీడీవోలు సునీత, మహ్మద్ అసీం, ఆర్ఐలు, అధికారులు పాల్గొన్నారు..