శేష్ మంచి మనసుకు సెల్యూట్ కొట్టాల్సిందే: వీరమరణం పొందిన ‘మేజర్‌’ ఉన్నికృష్ణన్‌కు నిజమైన నివాళి ఇదే

శేష్ మంచి మనసుకు సెల్యూట్ కొట్టాల్సిందే: వీరమరణం పొందిన ‘మేజర్‌’ ఉన్నికృష్ణన్‌కు నిజమైన నివాళి ఇదే

టాలెంటెడ్ హీరో అడివి శేష్ మంచి మనసుకు సలాం కొట్టాల్సిందే. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ‘మేజర్‌’ సందీప్ ఉన్నికృష్ణన్ ఫ్యామిలీని కలిసాడు హీరో అడివి శేష్. ప్రతి ఏడాది నవంబర్‌ 26న మేజర్‌ తల్లిదండ్రులను కలుస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం (2025) కూడా వారిని కలిసి తన ప్రేమను పంచుకున్నారు. ఈ క్రమంలో ముంబైలోని 26/11 స్మారక చిహ్నం వద్ద ‘మేజర్‌’ సందీప్ ఉన్నికృష్ణన్‌కు నివాళులు అర్పిస్తూ తన గౌరవాన్ని చాటుకున్నారు. 

ఈ సందర్భంగా మేజర్‌ తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు అడివి శేష్. మేము కొద్దిసేపు కలిసి నవ్వినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అంకుల్ & అమ్మ ఇద్దరినీ ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటానని శేష్ తెలిపారు. అలాగే ‘‘మేజర్‌ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోకూడదని నేను మొదటి వాగ్దానం చేసుకున్నాం. మా అమ్మ, అంకుల్‌కు కూడా ఇదే ప్రమాణం చేశా. నేను ఏ సినిమా చేస్తున్నా.. వీరితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. వీరితో నేను ఉంటున్నానంటే మేజర్‌ జ్ఞాపకాలు సజీవంగా ఉన్నట్లే. మన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరి పేర్లను, వారు చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదు’’ అని అడివిశేష్ అన్నారు.

ఈ క్రమంలో మేజర్‌ తల్లిదండ్రులతో దిగిన ఫొటోలకు నెటిజన్లు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. అడివిశేష్‌ మంచి మనసుకి ప్రశంసలు కురిపిస్తూ.. "ఎప్పటికీ మీరిలానే ఉండాలని.." శేష్ మంచి మనసుకు సెల్యూట్.. వీరమరణం పొందిన ‘మేజర్‌’ ఉన్నికృష్ణన్‌కు నిజమైన నివాళి ఇదే" అని కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం అడివి శేష్ డెకాయిట్, గూఢచారి 2 సినిమాల్లో నటిస్తున్నాడు. 2026 ఉగాది సందర్భంగా మార్చి 19, 2026న డెకాయిట్ విడుదల కానుంది

సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ జీవించారు..

సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. కానీ ఆయన ఎలా జీవించారో తెలియాలంటే ఈ మేజర్ సినిమా చూడాల్సిందే. ఆయన సోల్జర్ గానే కాకుండా ఒక కొడుకుగా, భర్త గా ఎలా ఉండేవాడనేది ఈ సినిమా చెప్తుంది. తన ఎమోషనల్ జర్నీ ని పరిచయం చేసింది ఈ మూవీ. ఓ సైనికుడు ఎలా ఉండాలి అనేదానికి ఉదాహరణే ఈ మూవీ. 2008 నవంబర్ 26న తాజ్ హోటల్ లో జరిగిన ఉగ్రవాద దాడిని కళ్లకు కట్టినట్టు ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ శశికిరణ్. మేజర్ సందీప్ తన ధైర్య సాహసాలతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చాలా మందిని ఎలా కాపాడాడో ఈ సినిమా ద్వారా చూడొచ్చు. 

మేజర్ సందీప్ రోల్ లో అడవిశేష్ జీవించి నటించాడని చెప్పాలి. ఆర్మీ ఆఫీసర్గా ఆ ఆహార్యం, లుక్స్ సరిగ్గా సరిపోయాయి. అడవిశేష్ తో సహా అందరూ ప్రాణం పెట్టి  పనిచేశారు. డైరెక్టర్ శశి కూడా చాలా నైఫుణ్యంతో ఈ సినిమాను తీర్చి దిద్దాడు. మేజర్ తల్లిదండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతిల నటన అద్భుతం. కొన్ని సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తారు.