ఓబెన్ ఎలక్ట్రిక్ కస్టమర్ సపోర్ట్ ప్రారంభం

ఓబెన్ ఎలక్ట్రిక్ కస్టమర్ సపోర్ట్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్ టూ-వీలర్ల సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ 24/7 కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది.  దీని ద్వారా, ఓబెన్ ఈవీల యజమానులు ఏ సమయంలోనైనా, ఎక్కడైనా సహాయాన్ని పొందవచ్చు. ఈవీలకు సర్వీస్​, సపోర్ట్​ విషయాల్లో ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. 

తమ కస్టమర్లకు అద్భుత అనుభవాన్ని అందించడమే ఈ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ ప్రధాన లక్ష్యమని ఓబెన్ ఎలక్ట్రిక్ తెలిపింది. ప్రతి కస్టమర్‌‌‌‌‌‌‌‌కూ ప్రత్యేకంగా రిలేషన్ షిప్ మేనేజర్‌‌‌‌‌‌‌‌ను కేటాయిస్తామని, దీనివల్ల వారి సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని పేర్కొంది.