పాట్నా రైల్వే స్టేషన్లో.. యాడ్స్ ప్లేసులో అశ్లీల చిత్రాలు

పాట్నా రైల్వే స్టేషన్లో.. యాడ్స్ ప్లేసులో అశ్లీల చిత్రాలు

పాట్నా రైల్వే స్టేషన్ లో వింత ఘటన జరిగింది. స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్ నంబర్ 10లో ఏర్పాటుచేసిన యాడ్స్ టీవీ స్క్రీన్లపై ఆదివారం ఉదయం 9:30కు మూడు నిమిషాలపాటు అడల్ట్ ఫిల్మ్ ప్లే అయింది. దీంతో స్టేషన్ లోని వందలమంది ప్రయాణికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)రి ఫిర్యాదు చేశారు. 

తర్వాత రైల్వే అధికారులు చర్యలు తీసుకొని దర్యాప్తు చేపట్టారు. టీవీ యాడ్స్ ప్రసారం చేస్తున్న దత్తా కమ్యూనికేషన్‌పై ఆర్పీఎఫ్.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఏజెన్సీని రైల్వే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ ఘటన జరగడానికి గల కారణాన్ని కనుక్కునే ప్రయత్నం చేసింది.