
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్‌పల్లిలో ఆదర్శ రైతు వెంకట్ రాములు వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు శుక్రవారం సందర్శించారు. అనంతరం మొండిగౌరెల్లిలో పూదీనా, మెంతుల సాగును పరిశీలించారు. స్థానికంగా పట్టుపురుగుల పెంపకం, మల్బరీ సాగు గురించి ఆరా తీశారు. స్థానిక మార్కెట్ లేకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.