Good Wife Review: ఓటీటీలోకి కోర్టు డ్రామా థ్రిల్ల‌ర్‌.. సెక్స్ వీడియోలో చిక్కుకున్న భర్త.. లాయర్‌‌‌‌‌‌‌‌గా భార్య ఏం చేసింది?

Good Wife Review: ఓటీటీలోకి కోర్టు డ్రామా థ్రిల్ల‌ర్‌.. సెక్స్ వీడియోలో చిక్కుకున్న భర్త.. లాయర్‌‌‌‌‌‌‌‌గా భార్య ఏం చేసింది?

ప్రియమణి ‘గుడ్ వైఫ్‌‌‌‌’గా ఆడియెన్స్‌‌‌‌ ముందుకొచ్చి శభాష్ అనిపించుకుంటోంది. ఇప్పటికే భామా కలాపం, ఫ్యామిలీ మేన్ లాంటి వెబ్ సిరీస్‌‌‌‌లతో మెప్పించిన ఆమె.. ఇప్పుడు ‘గుడ్ వైఫ్‌‌‌‌’ సిరీస్తో ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ శుక్రవారం (జులై 4న) జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళి, మరాఠి భాషల్లో అందుబాటులో ఉంది.

‘గుడ్ వైఫ్’పేరుతో వచ్చిన ఈ సిరీస్‌‌‌‌ అమెరికన్ షో ఆధారంగా సీనియర్ నటి రేవతి డైరెక్ట్ చేసింది. కానీ ఇది కార్బన్ కాపీ అయితే కాదు. కేవలం ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు కథను మార్చి రూపొందించింది. ఇందులో ప్రియమణి లాయర్‌‌‌‌‌‌‌‌గా నటించగా, ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ నటించాడు. సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్న భర్తని రక్షించుకునేందుకు భార్య ఏం చేసిందనేది ఈ సిరీస్ కథ. 

కథేంటంటే: 

తన భర్త ఉన్న ఓ సెక్స్ టేప్ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారుతుంది. అతణ్ని అరెస్టు చేస్తారు. ఆమె జీవితం ఒక్కసారిగా తలక్రిందులవుతుంది. 16 సంవత్సరాల వివాహం తర్వాత, ఆమె స్థిరంగా ఉన్నట్లు కనిపించే ప్రపంచం ముక్కలైపోతుంది. ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కోర్టు గదిలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత ఆమె సంక్లిష్టమైన న్యాయ పోరాటాలను మాత్రమే కాకుండా, ద్రోహం, బహిరంగ అవమానం మరియు పురుషాధిక్య ప్రపంచం వంటి కల్లోలాన్ని ఎదుర్కొంటుంది. మరి చివరికి కుట్రలను దాటి, తన భర్తను నిర్దోషిగా నిరూపించిందా? అసలు సెక్స్ వీడియోలో ఉండటానికి కారణమెవరు? సెక్స్ కుంభకోణంలో ఎలాంటి నిజాలు బయటకొచ్చాయి? అన్నదే మిగతా కథ. 

►ALSO READ | Prabhas: ప్రభాస్ది బాహుబలి హృదయం.. ఫిష్ వెంకట్ కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల సాయం!