
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ' ది రాజాసాబ్" ( The Raja Saab) విడుదలకు ఇంకా ఐదు నెలలు టైముంది. కానీ అభిమానుల హంగామా మాత్రం ఇప్పట్నుంచే ఊపందుకుంది. ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రం రామాంటిక్ హర్రర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ బాక్సాఫీస్ యుద్ధంలో విజేతగా దూసుకెళ్తోంది.
'ది రాజాసాబ్' ( The Raja Saab) కోసం బుక్ మై షోలో దాదాపు లక్షా 40 వేల మంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఇది ప్రీ బాక్స్ ఆఫీస్ పోరులో #3 స్థానంలో ఉంది. ఇది ఒక్కో మెట్టు ఎక్కుతూ జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ' వార్ 2'( War 2 ) లక్షా 59 వేల మంది ప్రేక్షకులు ఆసక్తి కనబర్చడంతో రెండవ స్థానంలో ఉంది. 'ది రాజాసాబ్' దీనిని అధిగమించాలంటే కేవలం 13 శాతం జంప్ చేస్తే చాలు.
టాప్ వన్ లో ఎవరున్నారో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' పార్ట్ 1 బుక్ మై షో ( Book My Show) లో నెంబర్ వన్ లో ఉంది. ఈ చిత్రానికి దాదాపు 2 లక్షల 58 వేల మందికి పై ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. భారీ అంచనాలతో ఈ మూవీ జూలై 24, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ' వార్ 2' నిలవగా ( 159.2K ) , మూడో స్థానంలో ప్రభాస్ 'ది రాజా సాబ్' ( 140 K) , నాల్గవ స్థానంలో పవన్ కళ్యాణ్ మూవీ 'OG' ( 128.K ) , టాప్ 5లో చిరంజీవి నటించిన 'విశ్వంభర' ( 115.4 K) చిత్రంపై ప్రేక్షకులు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
ASLO READ : Prabhas: ప్రభాస్ది బాహుబలి హృదయం.. ఫిష్ వెంకట్ కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల సాయం!
వార్ 2కు గట్టిపోటీ?
వార్ 2 మూవీ ఆగస్టు 14, 2025న థియేటర్లలోకి రానుంది. మరో నెల మాత్రమే టై ఉంది. అటు 'ది రాజాసాబ్' డిసెంబర్ 5, 2025న విడుదల కానుంది. ఇంకా ఐదు నెలల సమయం ఉంది. కాబట్టి ప్రీ- బాక్సాఫీస్ పోరులో ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగానే రెడీ అవుతున్నారని స్పష్టమవుతోంది. దీనిని బట్టి రిలీజ్ తర్వాత ప్రభాస్ మేనియా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'ది రాజాసాబ్' మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , ఐవీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మారుతి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా తెరక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రిద్ది కుమార్ కూడా నటించారు. తమన్ సంగీతం అందించారు.