
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల నేతలు. రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాట్లు చేయాలంటూ అసెంబ్లీ ముట్టడి యత్నించారు. వైశ్య సామాజిక వర్గాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. 50 ఏళ్లు దాటిన అన్ని వర్గాల రైతులకు నెలకు 5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రైతులకు 5 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఓసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం 25 లక్షల ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు... వారిని స్టేషన్ కు తరలించారు. అయితే ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల నేతలు.