గట్స్ ఉన్న వాళ్లకే హిట్స్ : తేజ సజ్జా

గట్స్ ఉన్న వాళ్లకే హిట్స్ : తేజ సజ్జా

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన  సూపర్ హీరో మూవీ ‘హను- మాన్’. కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌‌‌‌తో పాటు, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ చిత్రం విడుదలై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం గ్రాండ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించింది టీమ్. తేజ సజ్జా మాట్లాడుతూ ‘వంద రోజుల వేడుక జరుపుకోవడం ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్. ‘గట్స్ ఉన్న వాళ్లకే హిట్స్’ అని నాతో ఒకరు అన్నారు.  దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ గారికి అలాంటి గట్స్‌‌‌‌ ఉన్నాయి అని అన్నాడు.  

చిరంజీవి గారి ఇంద్ర, బాలకృష్ణ గారి సమర సింహారెడ్డి, వెంకటేష్ గారి నువ్వునాకు నచ్చావ్, మహేష్​ గారి పోకిరి సినిమాలు వంద రోజులు ఆడినప్పుడు చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు నేను డైరెక్ట్ చేసిన చిత్రం హండ్రెడ్​ డేస్ ఆడటం హ్యాపీగా ఉంది’ అని చెప్పాడు.  నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య మాట్లాడుతూ ‘హండ్రెడ్​ డేస్ సెలబ్రేషన్స్ చూసి చాలా రోజులైంది. మేం నిర్మించిన ఈ చిత్రం ఈ ఘనత సాధించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని చెప్పారు. నటులు సముద్రఖని, గెటప్ శ్రీను సహా  మూవీ టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.