
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్లో మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 (ఆదివారం) అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. చివరి ట్రైన్ రాత్రి 12.15 గంటల సంబంధిత స్టేషన్లో బయలుదేరి రాత్రి ఒంటిగంటకు గమ్యస్థానం చేరుకుటుందని తెలిపింది.
రెడ్, బ్లూ, గ్రీన్ లైన్ లలో అర్థరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో ఎండీ చెప్పారు. మెట్రో రైలు సమయా్ని పెంచడంతోపాటు ఆ సమయంలో భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మెట్రో రైలు స్టేషన్ల లో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి తాగి వచ్చినా, దుర్భాషలాడినా, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.