కవ్వాల్ టైగర్ జోన్​లో జంతువుల ఆక్యుపెన్సీ సర్వే

కవ్వాల్ టైగర్ జోన్​లో జంతువుల ఆక్యుపెన్సీ సర్వే

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్​లోని కోర్, బఫర్ ప్రాంతాల్లో జంతువుల ఉనికి, సంఖ్యతో పాటు వాటి కదలికలను తెలుసుకునేందుకే ఫారెస్ట్ ఆఫీసర్లు ఆక్యుపెన్సీ సర్వేను చేపట్టారు. పెద్దపులి మినహాయించి చిరుతపులి, ఎలుగు బంట్లు, చుక్కల జింక, గడ్డి జింక, దుప్పి, అడవి పందులు, కొండ గొర్రెలకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్వే నిర్వహిస్తున్నారు. 

ఈ సర్వేలో ఇద్దరు జంతు పరిశోధకులు, ఆరుగురు క్షేత్ర సహాయకులతో పాటు ఆయా రేంజ్​ల ఆఫీసర్లు,సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొంటున్నారు. చిరుతపులి, రేచు కుక్కలు, ఎలుగుబంట్లతో పాటు ఇతర మాంసాహార జంతువుల పాదముద్రలను, మలమూత్ర సంకేతాలను గుర్తిస్తున్నారు. శాకాహార జంతువుల పాదముద్రలతో పాటు పెంటికలను గుర్తిస్తూ సర్వే చేస్తున్నారు. గత నెలలో ప్రారంభించిన సర్వే ఈ నెల చివరిలోపు పూర్తవుతుందని జన్నారం ఇన్​చార్జ్ రేంజ్ ఆఫీసర్ సుస్మారావు తెలిపారు.