అక్టోబర్ 18న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ!

అక్టోబర్ 18న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ!

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అభ్యర్థుల ఎం పికపై బీజేపీ హైకమాండ్ బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనాలని ఇప్పటికే ఎంపీ లక్ష్మణ్,  పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఇతర నేతలకు హెడ్ ఆఫీస్ నుంచి సమాచారం అందినట్టు సమాచారం. బుధవారం ఉదయం కిషన్ రెడ్డి, సాయంత్రం వరకు లక్ష్మణ్ ఢిల్లీకి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల వారీగా రాష్ట్ర స్ర్కీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన జాబితా ఇప్పటికే హైకమాండ్ కు చేరింది. ఇందులో పలు మార్పులుచేర్పుల తర్వాత జాబితాను సీఈసీ ముందు పెట్టనున్నారు. సీఈసీ భేటీ అనంతరం ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.