ఇవాళ (అక్టోబర్ 20)హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

ఇవాళ (అక్టోబర్ 20)హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఇవాళ (అక్టోబర్ 20) ఎన్నికలు జరగనున్నాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తారు..ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.  ప్రెసెడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ,, ట్రెజరర్, కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. HCA లో మొత్తం 173 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో నాలుగు క్రికెట్ అసోసియేషన్ ప్యానెల్స్ పోటీలో పాల్గొంటున్నాయి.సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. 

సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ లావు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వీఎన్ సంపత్ HCA ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఆయా ప్యానెల్స్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పోటా పోటీగా ప్రెస్ మీట్స్ నిర్వహించారు. అధ్యక్ష పదవికి అనిల్ కుమార్, సెక్రటరీ పదవికి ఆగం రావు బరిలో ఉన్నారు. ప్యానెల్ ఫర్ గుడ్ గవర్నె్న్స్ పేరుతో అనిల్ కుమార్ పోటీ పడుతున్నారు. క్రికెటర్స్ సెలక్షన్స్ అవకతవకల్లేకుండా నిర్వహణ, జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్స్ నిర్మిస్తామని ప్యానెల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హామీ ఇస్తోంది.