అక్టోబర్ నెలలో పండుగలు, సెలవులు ఇవే..

అక్టోబర్ నెలలో పండుగలు, సెలవులు ఇవే..

నెల మారితే చాలు...  ఈ నెలలో ఏమేమి పండుగలున్నాయి.. ఆ పండుగకు సెలవు ఉంటుందా లేదా.. ఆ పండుగ  ప్రాధాన్యత ఏమిటి.. ఇలా అన్నింటిని ఆలోచిస్తారు  హిందువులు. ప్రతి నెల ఏదో పండుగ రావడం కామన్​.   ఈ ఏడాది( 2025) అక్టోబర్​ 2 వ తేదీన దసరా పండుగ ముగిసింది.   ఇంకా అక్టోబర్​ లో చాలాప్రధాన పండుగలు ఉన్నాయి.  ఈనెలలోనే  ( అక్టోబర్​ నెలలోనే) ఆశ్వయుజ మాసం ముగిసి ఎంతో విశిష్టమైన కార్తీకమాసం  ప్రారంభమవుతుంది. ఈక్రమంలో అక్టోబర్‌ నెలలో ఉన్న పండుగల గురించి తెలుసుకుందాం. .  

తిరుమలలో అక్టోబర్‌ నెల విశిష్ట పర్వదినాలు ఇవే!

  • అక్టోబర్ 2 : దసరా పండుగ.. విజయదశమి.. గాంధీ జయంతి...
  • అక్టోబర్ 3 :.. పాశాంకుశ ఏకాదశి ...  శ్రీవారి బాగ్ సవారి
  • అక్టోబర్ 4: శని త్రయోదశి
  • అక్టోబర్ 7 : మహర్షి వాల్మికీ జయంతి , పౌర్ణమి గరుడ సేవ
  •  అక్టోబర్ 8: అశూన్య శయన వ్రతం
  • అక్టోబర్ 9 : అట్లతద్ది
  • అక్టోబర్ 10:  సంకష్ట హర చతుర్ది
  • అక్టోబర్ 15 : తిరుమల నంబి ఉత్సవారంభం
  • అక్టోబర్ 17 : రామ ఏకాదశి
  • అక్టోబర్ 18 :  దంతెరాస్‌.. ధన త్రయోదశి.. శని త్రయోదశి
  • అక్టోబర్ 19 : నరక చతుర్దశి
  • అక్టోబర్ 20 :  దీపావళి ఆస్థానం
  • అక్టోబర్ 21: కేదార వ్రతం.. ఆకాశదీపం 
  • అక్టోబర్ 22 :  కార్తీక మాసం ప్రారంభం... గోవర్ధన్‌ పూజ
  • అక్టోబర్ 23 : భగినీహస్త భోజనం
  • అక్టోబర్ 24 : తిరుమలనంబి శాత్తుమొర
  • అక్టోబర్ 25 : నాగుల చవితి, పెద్ద శేష వాహనం
  • అక్టోబర్ 27 : .. కార్తీక మాసం మొదటి సోమవారం .. మానవాళ మహామునుల శాత్తుమొర
  • అక్టోబర్ 28 : సెనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం..  చాత్‌ట్‌ పూజ
  • అక్టోబర్ 29 : శ్రీవారి పుష్పయాగ అంకురార్పణ
  • అక్టోబర్ 30 : శ్రీవారి పుష్పయాగ మహోత్సవం
  • అక్టోబర్ 31 : పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, యాజ్ఞవల్క్య జయం

సెలవులు ఇవే..! 

  • (అక్టోబర్​ 3 వ తేది వరకు పాఠశాలలకు దసరా సెలవులు కొనసాగుతాయి)
  • అక్టోబర్ 2: గాంధీ జయంతి, దసరా
  • అక్టోబర్ 5: ఆదివారం
  • అక్టోబర్ 11: రెండో శనివారం (కొన్ని స్కూళ్లకు సెలవు)
  • అక్టోబర్ 12: ఆదివారం
  • అక్టోబర్ 19: ఆదివారం
  • అక్టోబర్ 20: దీపావళి
  • అక్టోబర్ 25: నాల్గో శనివారం
  • అక్టోబర్ 26: ఆదివారం