గ్రేహౌండ్స్‌‌ పోలీసుల త్యాగాలు మరువలేనివి: డీజీ విజయ్‌‌కుమార్‌‌

గ్రేహౌండ్స్‌‌ పోలీసుల త్యాగాలు మరువలేనివి: డీజీ విజయ్‌‌కుమార్‌‌

గండిపేట్, వెలుగు:  సమాజ హితం కోసం గ్రేహౌండ్స్‌‌ పోలీసుల త్యాగాలు మరువలేనివని గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌‌ అడిషనల్‌‌ డీజీ విజయ్‌‌కుమార్‌‌ కొనియాడారు. నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధి వ్యాస్ నగర్ రాష్ట్ర గ్రేహౌండ్స్‌‌లో వాగ్దేవి ప్రైమరీ స్కూల్‌‌లో కొత్త తరగతి గదులను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రేహౌండ్స్‌‌ సిబ్బంది అనేక రోజులు అడవుల్లో తిరుగుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ సవాళ్లతో డ్యూటీలు చేస్తున్నారన్నారు. వారి కుటుంబాల సంక్షేమానికి ఎంతచేసినా తక్కువేనన్నారు. స్కూల్ లో కొత్త గదులను నిర్మించేందుకు ముందుకు వచ్చిన సైబరాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ స్టీఫెన్‌‌ రవీంద్ర, ఏఆర్‌‌కే–ఎస్‌‌పీహెచ్‌‌ఎస్‌‌ 88 ఫౌండేషన్‌‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 

సివిల్‌‌ సర్వీసెస్‌‌ ఆఫీసర్స్‌‌ ఐపీఎస్‌‌ ట్రైనింగ్‌‌ పూర్తయిన తర్వాత మొదటగా గ్రేహౌండ్స్‌‌ పోస్టింగ్‌‌కి వస్తారని సైబరాబాద్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ స్టీఫెన్‌‌ రవీంద్ర పేర్కొన్నారు. హైదర్‌‌గూడలోని సెయింట్‌‌పాల్స్‌‌ స్కూల్‌‌లో 88 బ్యాచ్‌‌కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి ఏఆర్‌‌కే–ఎస్‌‌పీహెచ్‌‌ఎస్‌‌ 88 ఫౌండేషన్‌‌ ఏర్పాటు చేసి సమాజానికి తమవంతు సాయం అందిస్తున్నారన్నారు. అనంతరం గౌరవ అతిథులకు మెమోంటోలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో గ్రూప్‌‌ కమాండ్‌‌ ఆపరేషన్స్‌‌ అండ్‌‌ ట్రైనింగ్‌‌ బి.రోహిత్‌‌ రాజు, ఎం.రమేష్, సోమేశ్వర్‌‌సింగ్, దయానంద్, బి.వినాయక్‌‌రావు, రవీందర్‌‌రెడ్డి, డాక్టర్‌‌ సుధీర్‌‌ ప్రసాద్, రాజేష్‌‌ బోస్, రాజేష్‌‌ కుమార్, అగర్వాల్, వాగ్దేవి స్కూల్‌‌ ప్రిన్సిపల్‌‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.