ఆక్టోపస్ ‘హలో’ చెప్పింది

ఆక్టోపస్ ‘హలో’ చెప్పింది

భూమి మీద ఉన్నఅత్యంత తెలివైన జీవుల్లో ఆక్టోపస్ ఒకటని మరోసారి రుజువైంది. ఎనిమిది కాళ్లతో నడిచే ఈ ఆక్టోపస్ లు చాలా తెలివైనవని సైంటిస్టుల పరిశోధనల్లో కూడా తేలింది. ప్రస్తుతం వీటి తెలివితేటలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గాజు బాక్సులో ఉన్న ఓ ఆక్టోపస్ కు ఓ వ్యక్తి చేత్తో ‘హలో’ చెప్పాడు.దానికి అది బదులిస్తూ  ‘హలో’ చెప్పింది. దానికి అతడు సంతోషం వ్యక్తం చేశాడు.ఇది ఊహించలేదని విషయమని…విష్ చేస్తే ఎంత మర్యాదగా తిరిగి విష్ చేసిందో అంటూ ఆనందం వ్యక్తం చేశాడు ఆ వ్యక్తి.

నేచర్ ఈజ్ లిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూ గ్రహం మీద ఉండే అత్యంత తెలివైన వాటిలో ఆక్టోపస్ కూడా ఒకటి అని పోస్ట్ చేసింది.