గాంధీలోని అంశాలను లాయర్లు నేర్చుకోవాలె: ​ మురళీధర్​

గాంధీలోని అంశాలను లాయర్లు నేర్చుకోవాలె: ​ మురళీధర్​

మాదాపూర్, వెలుగు :  మహాత్మాగాంధీలోని అనేక అంశాలను లాయర్లు నేర్చుకోవాలని ఒడిశా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ సూచించారు. మాదాపూర్ శిల్పకళా వేదికలో మంథన్ సంవాద్ ఎన్జీవో ఆధ్వర్యంలో సోమవారం గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన యాన్యువల్ టాక్ లో పలువురు వక్తలు పాల్గొన్నారు. మురళీధర్ ​ముఖ్య అతిథిగా హాజరై ‘మహాత్మా గాంధీ యాజ్ ఏ లాయర్’ అంశంపై మాట్లాడారు. 

ప్రస్తుత తరానికి గాంధీ ఫ్రీడమ్ ఫైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మాత్రమే తెలుసని, అతను దక్షిణాఫ్రికాలో సక్సెస్ ఫుల్ లాయర్ అని పేర్కొన్నారు. ఆ దేశంతో పాటు 1911లో ఇండియాకి వచ్చిన ఆయన  ఇక్కడ కూడా కోర్టుల్లో పలు కేసులను వాదించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సెంటర్​ఆఫ్​ పాలసీ రీసెర్చ్ ప్రెసిడెంట్​యామిని అయ్యర్​తో పాటు పలువురు వక్తలు మాట్లాడారు.