ఒడిశాలో రైళ్ల ప్రమాదంతో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని రీషెడ్యూల్

ఒడిశాలో రైళ్ల ప్రమాదంతో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని రీషెడ్యూల్


సికింద్రాబాద్, వెలుగు: ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంతో ఆ రూట్​లో కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని రీ షెడ్యూల్​ చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ప్రకటించారు. హౌరా–- కన్యాకుమారి వెళ్లే సూపర్​ ఫాస్ట్ ​ఎక్స్​ప్రెస్​ను రద్దు చేశారు. అలాగే గౌహతి- ఎస్ఎంవీటీ– బెంగళూరు మధ్య నడిచే ఎక్స్ ప్రెస్​ టైమింగ్స్​లో మార్పులు చేశారు. సోమవారం ఉదయం  6.20 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 5.20 గంటలకు బయలుదేరింది. అలాగే షాలిమార్– చెన్నై సెంట్రల్, సత్రంగచ్చి-– తంబారం, హౌరా-– చెన్నై సెంట్రల్, హౌరా– -సికింద్రాబాద్, హౌరా – -బెంగళూరు, విల్లుపురం–-ఖరగ్​పూర్, హైదరాబాద్​ దక్కన్ –- షాలిమార్, షాలిమార్ – -తిరువనంతపురం, గౌహతి– -బెంగళూరు, షాలిమార్​– -సికిద్రాబాద్, ఎర్నాకుళం – -హౌరా, సికింద్రాబాద్​– -హౌరా రైళ్లను ఈనెల 5, 6, 7, 9 తేదీల్లో రద్దు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు.

గౌహతి– -సికింద్రాబాద్​ మధ్య స్పెషల్​ ట్రెయిన్

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే..  గౌహతి– -సికింద్రాబాద్ మధ్య వన్​వే పద్ధతిలో స్పెషల్​ ట్రెన్ ను నడుపుతోంది. ఈ రైలు ఈ నెల 18న ఉదయం 7.25 గంటలకు గౌహతిలో బయలుదేరి రెండు రోజుల తరువాత సికింద్రాబాద్​కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. కామాఖ్య, న్యూ బొంగయ్​గాన్, న్యూ కోచ్​ బెహార్, న్యూ జల్​పాయ్ గురి, కిషన్​గంజ్, మాల్దా టౌన్, రామ్​పూర్​ హాల్ట్, బద్రామం, దన్​కుని, ఖరగ్​పూర్, కటక్, భువనేశ్వర్, కుర్దా రోడ్, బెర్హంపూర్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా సికింద్రాబాద్​కు చేరుకుంటుంది.

మృతులను గుర్తించాలని రైల్వే విజ్ఞప్తి

ఒడిశాలోని రైళ్ల ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చేరవేయడానికి సహకరించాలని కోరింది. మృతుల ఫొటోలు, ఆసుపత్రుల్లో చేరిన వారి వివరాలను ఒడిశా ప్రభుత్వ సహకారంతో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. మరణించిన వారి ఫొటోలను  https://srcodisha.nic.in/ వెబ్ సైట్ లో, వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్న వారి  వివరాలను https://www.bmc.gov.in/train-accident  వెబ్ సైట్ లో, కటక్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తుల వివరాలను  https://www.bmc.gov.in/train-accident  వెబ్ సైట్ లో అప్ లోడ్  చేశామని అధికారులు వివరించారు. అలాగే రైళ్ల ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారి బంధువులు రైల్వే హెల్ప్‌లైన్  నంబర్ 139 ను కూడా సంప్రదించవచ్చని సూచించారు. ఈ నంబర్  24 గంటలు పనిచేస్తుందని చెప్పారు.