
ఒడిశాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేంద్రపడా జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని వరదల్లో ప్రజలు చిక్కుకున్నారు. రతన్ పూర్, దశమంతపూర్ గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండ్రోజుల నుంచి NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అధికారులు ఇప్పటికే 70 మందిని కాపాడారు.
వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు లక్షా 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాలాసోర్, మయూర్ భంజ్ జిల్లాల్లో సువర్ణరేఖ, బైతరణి నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. మరో రెండ్రోజులు ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.