రియల్​ ఎస్టేట్​ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్ డిటెయిల్స్​ డిజిటల్​ చేయాలి

రియల్​ ఎస్టేట్​ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్ డిటెయిల్స్​ డిజిటల్​ చేయాలి

న్యూఢిల్లీ: రియల్​ ఎస్టేట్​లో విదేశీ పెట్టుబడుల విషయంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్​ రిజిస్టర్లను డిజిటలైజ్​ చేయడం మేలని, వివిధ దేశాలు ఆ సమాచారాన్ని పరస్పరం అందించుకోవడం అవసరమని ఓఈసీడీ రిపోర్టు వెల్లడించింది. ఈ సమాచారం సంబంధిత ప్రభుత్వ ఏజన్సీలకు రియల్​–టైములో అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోవాలని ఈ రిపోర్టులో సూచించింది. 

రియల్​ ఎస్టేట్​పై ఫోకస్​తో ఇంటర్నేషనల్​ ట్యాక్స్​ ట్రాన్స్​పరన్సీ పెంపుదల అనే అంశంపై ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఎకనమిక్​ కో–ఆపరేషన్​ అండ్​ డెవలప్​మెంట్​ (ఓఈసీడీ) ఒక రిపోర్టును తీసుకొచ్చింది. పన్నులు చెల్లించకుండా ఉండేందుకు ఫైనాన్షియల్​ ఎసెట్స్​లోని పెట్టుబడులను విదేశీ రియల్​ ఎస్టేట్​లోకి మళ్లించడం గత పదేళ్లలో ఎక్కువైందని రిపోర్టులో స్పష్టం చేసింది. క్రాస్​ బోర్డర్​ రియల్​ ఎస్టేట్​ఇన్వెస్ట్​మెంట్లపై పూర్తి సమాచారం పన్ను అథారిటీలకు ఉండదని పేర్కొంది. గత పదేళ్లలో విదేశీయుల రియల్​ ఎస్టేట్​ పెట్టుబడులు  పెరిగినట్లు సంకేతాలున్నాయని వివరించింది.

 ఏదైనా ఒక దేశంలో మరో దేశానికి చెందిన వ్యక్తులు లేదా సంస్థలు పెట్టే రియల్​ ఎస్టేట్​ పెట్టుబడులతో ట్యాక్స్​ కంప్లయన్స్​ రిస్క్​లు కూడా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో  ఓఈసీడీ రిపోర్టు తెలిపింది. జీ 20 దేశాల సమావేశం సందర్భంగా తాజా రిపోర్టును తీసుకొచ్చారు. ఇప్పటికే ఆపరేషనల్​గా ఉన్న గేట్​వేస్​ ద్వారానే మొదట్లో వివిధ దేశాలు తక్కువ ఖర్చుతోనే తమ సమాచారాన్ని పంచుకోవచ్చని రిపోర్టు సూచించింది. 

తర్వాత దశలో యాంటీ–మనీలాండరింగ్​ ఫ్రేమ్​వర్క్​ కింద డిజిటలైజ్డ్​ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్​ రిజిస్టర్స్​ను రూపొందించి, ఒక దేశం మరో దేశానికి అందించుకోవచ్చని పేర్కొంది. రియల్​ ఎస్టేట్​లో విదేశీ ఓనర్షిప్​ అనే అంశంపై ఒక రిపోర్టు తీసుకు రావాల్సిందిగా జీ 20 ప్రెసిడెంట్​గా ఉన్న ఇండియా కోరినట్లు ఓఈసీడీ వెల్లడించింది