ఇరిగేషన్​, ఇతర ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం రైతులకు అప్పులివ్వాలి

 ఇరిగేషన్​, ఇతర ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం రైతులకు అప్పులివ్వాలి

 ఇరిగేషన్​, ఇతర ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం రైతులకు మరిన్ని అప్పులివ్వాల్సిందిగా కో - ఆపరేటివ్​ బ్యాంకులకు కో–ఆపరేషన్, హోమ్‌ శాఖ మంత్రి​ అమిత్​ షా సూచించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశలో కో–ఆపరేటివ్స్​ డేటా బేస్​ను ప్రభుత్వం తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచకుండా, రైతుల ఆదాయం పెంచడం వీలు కాదని ఒక నేషనల్​ కాన్ఫరెన్స్​లో  షా పేర్కొన్నారు. దేశంలోని సాగు విస్తీర్ణం పెరిగేలా కో–ఆపరేటివ్​ బ్యాంకులు చొరవ తీసుకోవాలని, అందుకు తగినట్లుగా అప్పులు ఇవ్వాలని చెప్పారు. ఇండియాలో 49.4 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని, అమెరికా తర్వాత ఇదే ఎక్కువని పేర్కొన్నారు.

దేశంలోని సాగు భూమి మొత్తానికి ఇరిగేషన్​ సదుపాయాలు కల్పిస్తే, ప్రపంచం మొత్తానికే మన దేశం ఆహారం అందించగలుగుతుందని చెప్పారు. కో–ఆపరేటివ్​ బ్యాంకులు దేశంలో 90 ఏళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెబుతూ, 1924లో మొదటిసారిగా రైతులకు లాంగ్​ టర్మ్​ అప్పులను ఇచ్చాయని గుర్తు చేశారు. కానీ, గత 90 ఏళ్ల డేటా చూస్తే ఈ రంగంలో పెద్దగా గ్రోత్​ కనబడటం లేదని పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలలో కో–ఆపరేటివ్​ బ్యాంకులు రైతులకు అప్పులివ్వడం తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. అగ్రికల్చరల్​ అండ్​ రూరల్​ డెవలప్​మెంట్​ బ్యాంకులు దేశంలోని రైతులకు 3 లక్షల ట్రాక్టర్ల కొనుగోలుకు అప్పులు ఇచ్చాయని, కానీ ఈ టార్గెట్​ 8 కోట్లుగా ఉండాలని అమిత్ షా సూచించారు. 5.2 లక్షల మంది రైతులకు మీడియం, లాంగ్​ టర్మ్​ ఫైనాన్స్​ను ఈ బ్యాంకులు అందించాయని, ఇది సరిపోదని చెప్పారు.