
హైదరాబాద్, వెలుగు: భారత మార్కెట్లో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ సిత్రియాన్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు కంపెనీకి చెందిన అన్ని మోడళ్లపై లభిస్తాయి.
కొత్త కారు కొనుగోళ్లపై ఆకర్షణీయమైన నగదు ప్రయోజనాలు ఉంటాయి. అదనపు వారంటీ ఇస్తారు. ఈఎంఐ ఫైనాన్స్ పథకాలు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.80 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని సిత్రియాన్ తెలిపింది. ఈ నెల 30 లేదా స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం సిత్రియాన్ వాహనాలను కలిగి ఉన్న కస్టమర్లకు జూన్ నెల అంతా ఉచిత కారు స్పా సేవను కూడా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.