ఆఫీసు ఖర్చులు అధికమే.. హైదరాబాద్లో 35 శాతం పెరుగుదల

ఆఫీసు ఖర్చులు అధికమే.. హైదరాబాద్లో 35 శాతం పెరుగుదల

హైదరాబాద్​, వెలుగు: చిన్న ఆఫీసుల నిర్వహణ ఖర్చులు హైదరాబాద్​లో వార్షికంగా 35 శాతం పెరిగాయని రియల్​ఎస్టేట్​కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దీని నివేదికప్రకారం, పది వేల నుంచి 30వేల చదరపు అడుగుల్లోపు ఉండే కార్యాలయాల్లో ఫెసిలిటీ మేనేజ్​మెంట్​ ఖర్చులు చదరపు అడుగుకు రూ.25.32 వరకు ఉన్నాయి.  

లక్ష నుంచి  మూడు లక్షల చదరపు అడుగుల్లో ఉండే పెద్ద కార్యాలయాల్లో ఈ ఖర్చు కేవలం  రూ.17.25 వరకే ఉంది. భవన మౌలిక సదుపాయాలు, సెంట్రల్​ కమాండ్ సిస్టమ్స్, ఆటోమేషన్ వల్లపెద్ద ఆఫీసుల్లో ఖర్చులు తగ్గుతున్నాయి.