- రెండు సర్కిళ్ల ఏర్పాటుకు యోచన
- ప్రపోజల్స్‌ను ఓకే చేసినట్లు సమాచారం
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌ను పోలీస్ సబ్ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ ఆఫీసర్లు నిర్ణయించినట్లు సమాచారం. ఆదివాసీ ఉద్యమంతో పాటు జైనూర్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో జైనూర్ మండలంలో ఆదివాసీ గిరిజన మహిళ మీద ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం, దాడి తర్వాత జరిగిన ఘటనలు గొడవలకు కారణమయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ స్వయంగా జైనూర్‌కు వచ్చి లా అండ్ ఆర్డర్ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగానే జైనూర్‌లో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్కిల్‌గా ఉన్న జైనూర్‌ను డీఎస్పీ స్థానంగా మార్చి లింగాపుర్, సిర్పూర్ యూ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొత్త సర్కిల్, జైనూర్, కెరమెరి కలిపి మరో సర్కిల్ చేయనున్నట్లు సమాచారం. ఇక వాంకిడి పోలీస్ స్టేషన్ సీఐ ఎస్‌హెచ్‌వోగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన శాఖపరమైన ప్రక్రియ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుందని, కొత్తగా ఏర్పాటు చేయనున్న సబ్ డివిజన్ ఆఫీస్‌తో పాటు సర్కిల్ ఆఫీస్‌ల కోసం బిల్డింగ్‌లు గుర్తించే పనిలో నిమగ్నం అయినట్లు సమాచారం. సబ్ డివిజన్ ఏర్పాటు వల్ల నిరంతర పర్యవేక్షణతో పాటు జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలుగకుండా చూసే అవకాశం ఉందని సీనియర్ ఆఫీసర్లు భావిస్తున్నారు.