గూడూరు మండల పరిధిలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆఫీసర్లు

గూడూరు మండల పరిధిలో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆఫీసర్లు

గూడూరు/ మొగుళ్లపల్లి/ పర్వతగిరి (సంగెం)/ ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు:  మొదటి విడత నామినేషన్​ కేంద్రాలను చివరి రోజైన శనివారం పలువురు ఆఫీసర్లు తనిఖీ చేశారు. మహబూబాబాద్​ జిల్లా గూడూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లోని కేంద్రాలను ఎన్నికల అబ్జర్వర్​ మధుకర్​ బాబు తనిఖీ చేసి, ప్రక్రియను పరిశీలించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు రంగాపురంలోని కేంద్రాలను ఆ జిల్లా ఎలక్షన్​ అబ్జర్వర్​ ఫణీందర్​రెడ్డి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. 

వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు క్లస్టర్లలో చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్​ సత్యశారద పరిశీలించారు. సంగెం మండలంలో తహసీల్దార్​ రాజ్​కుమార్​ 8 క్లస్టర్లను పరిశీలించగా, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు శివకుమార్​ నాయుడు సందర్శించి అధికారులతో మాట్లాడారు. కేంద్రం ఏర్పాట్లపై  ఆరా తీశారు.