చీకోటి ప్రవీణ్‌ను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

చీకోటి ప్రవీణ్‌ను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ

హైదరాబాద్‌ : క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు అధికారులు చీకోటి ప్రవీణ్‌ను విచారించారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీపై అధికారులు ప్రశ్నించారు. థాయిలాండ్‌ క్యాసినో కేసు తర్వాత చీకోటి సహా పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

క్యాసినో నిర్వహిస్తుండటంతో చీకోటి ప్రవీణ్‌ను థాయిలాండ్‌లో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు లావాదేవీల గురించి ఈడీ తాజాగా ప్రవీణ్‌ను ప్రశ్నించింది. చీకోటి ప్రవీణ్‌తో పాటు చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌లకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు సంబంధించి చీకోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మరోసారి ప్రశ్నించింది.