
మహబూబాద్ జిల్లా: సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మహబూబా బాద్ జిల్లా పెరుమాండ్ల సంకీస గ్రామంలో సాయుధ రైతాంగ పోరాట సమరయోధుల కుటుంబాల్ని సన్మానించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను కేసీఆర్ మర్చిపోయారన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తానని కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు లక్ష్మణ్. తెలంగాణ సాయుధ పోరాట అమర యోధుల కుటుంబాలను సన్మానించినవారిలో.. లక్ష్మణ్, మాజీ ఎంపీలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, రవీంద్రనాయక్, మాజీ మంత్రి డీకే అరుణ, పెద్దిరెడ్డి, రాజవర్ధన్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు తోర్రూర్ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు బీజేపీ నేతలు.