
తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నిన్న ( మే 5)న తెలంగాణలోని కరీంగర్ భూ ప్రకంపనలు రాగా.. ఈ రోజు ( మే 6) ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. ఈ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి.. పరుగులు తీశారు. పొదిలి.. ముండ్లమూరు.. దర్శి.. కురిచేడు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు.
సోమవారం ( మే 5)ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూమి కంపించింది. కొద్ది సెకన్లపాటు ఏమి జరుగుతుందో ప్రజలకు అర్దం కాక.. పరుగులుపెట్టారు. ఇళ్లలోని వస్తువులు కదలడంతో భయంతో బయటకు వచ్చేశామని స్థానికులు చెబుతున్నారు. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు కంపించినట్లు స్థానికులు వెల్లడించారు..