
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంపై ఇండియా సైనిక దాడిపై స్పందించింది ఐక్యరాజ్య సమితి. ఇండియా, పాకిస్తాన్ సైనిక దాడులను.. యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని.. ఇది చాలా ప్రమాదకరం అంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై ఇండియా సైనిక దాడి వల్ల.. రెండు దేశాల మధ్య సైనిక యుద్ధ వాతావరణం నెలకొందని.. వెంటనే ఈ ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరం రెండు దేశాలకు ఉందంటూ చెప్పుకొచ్చారు ఆంటోనియో. ఇండియా, పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని.. ఈ రెండు దేశాలు సైనిక యుద్ధానికి దిగితే అది ప్రపంచానికే మంచిది కాదని.. ప్రపంచం భరించలేదంటూ స్పష్టం చేశారాయన.
ఆపరేషన్ సిందూర్’ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది.
Also Read:- ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బకు లష్కర్-ఏ-తొయిబా కకావికలం.. హఫీజ్ అబ్దుల్ మాలిక్ ఔట్..?
పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఘాటుగా స్పందించారు. భారత్‌ది పిరికిపంద చర్య అని, పాక్ పౌరులు 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించారు. ఇండియాలో తామ ఎప్పడు.. ఎక్కడ ఏం చేస్తామో చెప్పమని -పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పడం గమనార్హం.
ఇది యుద్ధ చర్యే: పాక్ ప్రధాని షెహబాజ్
పాకిస్తాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఈ దాడులను యుద్ధ చర్యగా పేర్కొంటూ ఖండించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్జాతీయ, దేశీయ విమానాలను నిలిపివేశారు. ఖచ్చితంగా ఇండియా దాడులకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.