Operation Sindoor: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ దెబ్బకు లష్కర్-ఏ-తొయిబా కకావికలం.. హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ ఔట్..?

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ దెబ్బకు లష్కర్-ఏ-తొయిబా కకావికలం.. హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ ఔట్..?

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడులకు కౌంటర్గా భారత్ చేసిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’లో కీలక ఉగ్రనేతలు హతమయ్యారు. లష్కర్-ఏ-తొయిబా నేత హఫీజ్‌ అబ్దుల్ మాలిక్‌ మృతి చెందినట్లు సమాచారం. మురిడ్కేలోని మర్కజ్‌ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది.

లష్కర్-ఏ-తొయిబా నేత హఫీజ్‌అబ్దుల్ మాలిక్‌తో పాటు మరో ఉగ్ర నేత ముదాసిర్‌ భారత్ దాడుల్లో హతమైనట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపై ఎలాంటి దాడులు జరపకుండా భారత ఆర్మీ సంయమనం పాటించింది. పాక్తో పాటు పీఓకేలో ఉన్న తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మాత్రమే భారత్ వైమానిక దాడులు చేసింది.

లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. పాక్లోని నాలుగు, పీవోకేలోని ఐదు ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు కౌంటర్గా భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. 

Also Read : ‘ఆపరేషన్ సిందూర్’ విచారకరం అంట.

మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతోపాటు పాక్‌లోని 9 టెర్రరిస్ట్‌ స్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్‌ మిసైళ్లతో అటాక్‌ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి.