Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ విచారకరం అంట..: చైనా ఎలా వెనకేసుకొస్తుందో చూడండి..!

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ విచారకరం అంట..: చైనా ఎలా వెనకేసుకొస్తుందో చూడండి..!

పాకిస్తాన్ దేశంలో ఇండియా చేస్తున్న దాడులపై చైనా తెగ మదనపడుతోంది. పాక్ పై దాడులు విచారకరం అంటూ ప్రకటన వెల్లడించింది. పాకిస్తాన్ దేశంపై ఇండియా దాడులు చేయటాన్ని విచారకరంగా అభివర్ణిస్తూ.. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది చైనా.

డ్రాగన్ దేశం ప్రకటన చూస్తుంటే.. పాకిస్తాన్ దేశానికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా తేలిపోయింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి అంటూ చెప్పటం ఏంటీ అంటూ భారతీయులు మండిపడుతున్నారు.

పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాడి ఎంత ఘోరమైందో.. ఎంత నీచమైందో చైనాకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ‘ఆపరేషన్ సిందూర్’పై డ్రాగన్ దేశం చైనా స్పందించింది. భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు ధ్వంసం కావడంపై చైనా విచారం వ్యక్తం చేసింది.

భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, చైనాకు ఇండియా, పాకిస్తాన్ పొరుగు దేశాలని చైనా అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు. టెర్రరిజాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీవోకే, పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి.

పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు.

Also Read:-ఆపరేషన్ సిందూర్ సెలబ్రేట్ చేసుకుంటున్న మార్కెట్లు.. నష్టపోయిన రూపాయి..