Market Updates: ఆపరేషన్ సిందూర్ సెలబ్రేట్ చేసుకుంటున్న మార్కెట్లు.. నష్టపోయిన రూపాయి..

Market Updates: ఆపరేషన్ సిందూర్ సెలబ్రేట్ చేసుకుంటున్న మార్కెట్లు.. నష్టపోయిన రూపాయి..

Markets in Gains: ఉదయం ఆరంభంలో స్వల్ప నష్టాలను నమోదు చేసినప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి పుంజుకున్నాయి. ప్రధానంగా భారత ఆర్మీ పాకిస్థాన్ లోని టెరర్రిస్టుల క్యాంపులు, వారి లాంచ్ ప్యాడ్లపై బాంబుల వర్షం కురిపించటంతో మార్కెట్లు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. 

ఉదయం .9.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 23 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 290 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 180 పాయింట్లు పెరుగుదలను నమోదు చేసింది. అయితే సమయం గడుస్తున్న కొద్ది మార్కెట్లు స్థిరంగా లాభాలతో ముందుకు సాగుతున్నాయి. 

ప్రధానంగా బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభ నష్టాల నుంచి నేడు తేరుకుని లాభాల్లో ముందుకు సాగటానికి ఆటో, బ్యాంకింగ్ రంగాలు ధోరహదపడ్డాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగం షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

Also Read:-ఆపరేషన్ సిందూర్’ విచారకరం అంట..: చైనా ఎలా వెనకేసుకొస్తుందో చూడండి..!

పతనమైన రూపాయి విలువ..
ఒకపక్క భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నేడు రూపాయి మారకపు విలువ డాలరుతో పోల్చితే ఉదయం 18 పైసల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. దీంతో రూపాయి డాలర్ మారకపు విలువ రూ.84.62కి దిగజారింది. పాక్ భూభాగంలోని ఉద్రవాదుల ప్రధాన క్యాంపులపై ఈసారి భారత్ దాడులు చేసి వాటిని ధ్వంసం చేయటం పాకిస్థానుకు పెద్ద దెబ్బగా మారింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా కొంత ఆందోళనలు పెరగటం కూడా రూపాయి విలువ పతనానికి కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.