Mock Drills: సాయంత్రం మాక్ డ్రిల్స్ యధాతథం.. రద్దుపై ఫేక్ న్యూస్ నమ్మెుద్దు!

Mock Drills: సాయంత్రం మాక్ డ్రిల్స్ యధాతథం.. రద్దుపై ఫేక్ న్యూస్ నమ్మెుద్దు!

Fact Check on Mock Drills: ఈరోజు తెల్లవారు జామున 1.44 గంటల సమయంలో భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్ కింద పాకిస్థాన్ ఊహించని చావుదెబ్బతింది. అయితే దీని తర్వాత నేడు దేశంలో జరగాల్సిన మాక్ డ్రిల్స్ రద్దైనట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాస్తవానికి నేడు సివిల్ మాక్ డ్రిల్స్ ఉంటాయా లేవా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా పౌరులకు యుద్ధ సమయంలో ఎలా స్పందించాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పెహల్గామ్ దాడి తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలి, కంట్లోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్స్ ఎలా పనిచేస్తాయనే అంశాలను ఇందులో పరీక్షిస్తారు. వీటి ద్వారా నిజంగా అనుకోని పరిస్థితులు ఎదురైనపప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎలా సంయుక్తంగా ముందుకు సాగాలనే విషయాలను పరిశీలిస్తారు. 

ఈరోజు సాయంత్రం 4 గంటలకు 7 గంటల వరకు ఈ మాక్ డ్రిల్స్ దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. యూపీలోని బరేలీలో జిల్లాల వారీగా బ్లాకౌట్ రాత్రి 8 నుంచి 8.10 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయంలో పౌరులు తమ ఇళ్లలో లైట్లను ఆపటం, ఇన్వెర్టర్లను వినియోగించకపోవటం, సెల్ ఫోన్ లేదా ఫ్లాష్ లైట్లను వినియోగించటం మానేయాలని సూచించారు. 

ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించబడింది. దీనికింద కోత జాలరిపేట వద్ద వైమానిక దాడి అనుకరణ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. కొత్త జాలరిపేట, ఆక్సిజన్ టవర్లలో సాయంత్రం 7 గంటలకు బ్లాక్అవుట్ ఉంటుంది. ఇదే క్రమంలో దేశరాజధాని దిల్లీ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అండమాన్ & నికోబార్ దీవులు పౌర రక్షణ మాక్ డ్రిల్‌లకు పూర్తిగా సిద్ధం చేయబడ్డాయని వెల్లడైంది. అలాగే సాయంత్రం 4 గంటలకు వైమానిక దాడి సైరన్లను దేశరాజధాని దిల్లీలో మోగించనున్నారు. 

Also Read : ‘ఆపరేషన్ సింధూర్’ సక్సెస్తో.. ట్రెండింగ్లోకి వ్యోమికా సింగ్

నేడు నిర్వహించనున్న సివిల్ డిఫెన్స్ డ్రిల్‌లో సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోమ్ గార్డులు, NCC, NSS క్యాడెట్లు, NYKS వాలంటీర్లు, పాఠశాల-కళాశాలల విద్యార్థులు చురుకుగా పాల్గొననున్నారు. ఈ డ్రిల్ గ్రామ స్థాయి వరకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి 1941 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రజలకు పౌర రక్షణ, వైమానిక దాడులు, రెస్క్యూ కార్యకలాపాలు వంటి వాటిని నాగ్‌పూర్ నివాసి అయిన ఇ. రాఘవేంద్రరావు నేర్పించారు.