బోడుప్పల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత

బోడుప్పల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉదయం నుంచి పోలీసుల భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం,నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూల్చి వేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్ లో పుట్టగొడుగులా వెలుస్తున్న అక్రమ కట్టడాలను వదిలేసి తమ కట్టడాలను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న బాధితులు. అనుమతి లేకుండా ఏలాంటి కట్టడాలు నిర్మించినా కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు  హెచ్చరిస్తున్నారు. 

జేసీబీల సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరినా అధికారులు వినిపించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.