కొత్త మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

కొత్త మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • కొత్త మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • సిద్ధం చేస్తున్న అధికారులు
  • కొత్తగా 8 జిల్లాల్లో కాలేజీలకు పర్మిషన్ కోసం కసరత్తు 

హైదరాబాద్, వెలుగు : జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం కసరత్తు మొదలుపెట్టింది. కొత్త కాలేజీల ఏర్పాటుకు సంబంధించి జూన్‌‌‌‌‌‌‌‌ మూడో వారంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నోటిఫికేషన్ వెలువడనుంది. అప్పటికల్లా కాలేజీల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఖమ్మం, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అసిఫాబాద్‌‌‌‌‌‌‌‌, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా కనీసం 330 బెడ్ల హాస్పిటల్, కాలేజీకి జాగా వంటివన్నీ డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించాల్సి ఉంటుంది. ఖమ్మం, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 330 బెడ్ల కంటే ఎక్కువ కెపాసిటీతో హాస్పిటల్స్ సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన ఆరు కొత్త జిల్లాలు కావడంతో అక్కడి హాస్పిటళ్లలో మెడికల్ కాలేజీకి అవసరమైన బెడ్ల కెపాసిటీ లేదు. ఈ ఆరు జిల్లాల్లో  వంద నుంచి 150 బెడ్ల హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. దీంతో ఆయా హాస్పిటళ్లను అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.  కొన్ని హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ను ఆనుకుని కాలేజీకి సరిపడా స్థలం ఉండగా, ఇంకొన్ని జిల్లాల్లో స్థలం కేటాయించాల్సి ఉంది. త్వరగా భూమిని కేటాయించాలని కలెక్టర్లకు హరీశ్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు జారీ చేశారు. జూన్‌‌‌‌‌‌‌‌ లేదా జులైలో ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీకి దరఖాస్తు చేసుకుంటే, అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతా సక్రమంగా జరిగితే 2023–24 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త కాలేజీలు అందుబాటులోకి వస్తాయి.

జులైలో ఎన్ఎంసీ నిర్ణయం  
మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భ‌‌‌‌‌‌‌‌ద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి  జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీల కోసం నిరుడు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లు, ఫస్టియర్ క్లాసులు నిర్వహించిన టెంపరరీ కాలేజీలను ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ బృందాలు తనిఖీ చేశాయి. లోపాలు ఏమేం ఉన్నాయో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు రాసి పంపించాయి. ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సరిదిద్ది, రిప్లై పంచామని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ‘వెలుగు’కు తెలిపారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందితే కాలేజీలకు పర్మిషన్ వస్తుంది. లేదంటే మరోసారి ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ అధికారులు టీమ్స్ తనిఖీలకు వచ్చే అవకాశం ఉంటుంది. జులై లేదా ఆగస్ట్‌‌‌‌‌‌‌‌లో పర్మిషన్‌‌‌‌‌‌‌‌పై ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ నిర్ణయం రావచ్చని, 8 కాలేజీలకు పర్మిషన్ వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీటికి పర్మిషన్ వస్తే 2022–23 నుంచే కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో కాలేజీలో 150 సీట్ల చొప్పున, 1200 ఎంబీబీఎస్ సీట్లు యాడ్ అవుతాయి. వీటితో కలిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4 వేలు దాటుతుంది.