బీఆర్ఎస్ కబ్జా నిజమే .. అరెకరం ఆక్రమించినట్లు తేల్చిన ఆఫీసర్లు

బీఆర్ఎస్ కబ్జా నిజమే .. అరెకరం ఆక్రమించినట్లు తేల్చిన ఆఫీసర్లు

జనగాను, వెలుగు: జనగామ బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ పక్కనే ఉన్న అరెకరం స్థలాన్ని ఆక్రమిం చినట్లు అధికారులు తేల్చారు. 'దర్జాగా కబ్జా' శీర్షికన ఈ నెల 7న వెలుగు దినపత్రికలో ప్రచురి తమైన కథనంపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేష ట్టారు. యశ్వంతాపూర్ సమీపంలోని పార్టీఆఫీస్ స్థలాన్ని సోమ, మంగళవారాల్లో సర్వేచేశారు. తహసీల్దార్ వెంకన్న, ఆర్బ అన్వేశ్ సర్వేయ 5. రాణా ప్రతాప్ స్థలాన్ని సర్వే చేసి అరెకరం అదనంగా ఉన్నట్లు తేల్చారు. పార్టీ ఆఫీస్ నిర్మా ణానికి అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఎకరం స్థలాన్ని

కేటాయించింది. ఆ స్థలంలో ఆఫీస్ బిల్డింగ్ను నిర్మించారు. దీంతోపాటు ఆఫీస్ ముందు ఉన్న 82/16, 82/17. 82/18, 82/19 సర్వే నంబర్లోని మరో అర ఎకరం స్థలాన్ని ఆక్రమిం చికాంపౌండ్ వాల్ నిర్మించి పార్కింగ్ కు వాడు కుంటున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. పార్టీ ఆఫీస్ బేరర్కు నోటీసులు జారీ చేయాలని జనగామ తహసీల్దార్ వెంకన్నను ఆదేశించినట్లు ఆడిషన ల్ కలెక్టర్ రోహిత్ సింగ్ తెలిపాడు. అర ఎకరం భూమికి సంబంధించిన ఆధారాలను అందించా ల్సి ఉంటుందన్నారు. 15 రోజుల గడువులోగా సరైన సమాధానం ఇవ్వకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.