యాదాద్రి: హరే రామ హరే కృష్ణ ఆశ్రమం కూల్చివేత

యాదాద్రి: హరే రామ హరే కృష్ణ ఆశ్రమం కూల్చివేత

యాదాద్రిలో  హరే రామ  హరే కృష్ణ   ఆశ్రమాన్ని అధికారులు  కూల్చివేశారు.  రాత్రికిరాత్రే  ఆశ్రమాన్ని తొలగించారు.  కొండ చుట్టూ  వేస్తున్న  రీజనల్ రింగ్  రోడ్డుకు  అడ్డు వస్తుండడంతో  ఆశ్రమాన్ని తొలగించాలని  గతంలోనే  నిర్ణయించారు. దానికిగాను  కోటిన్నర రూపాయల పరిహారం  అప్పట్లోనే  చెల్లించింది ప్రభుత్వం . అయినా  ఆశ్రమాన్ని నిర్వాహకులు  తొలగించకపోవడంతో  RDO వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  రాత్రి సమయంలో  కూల్చివేత  ప్రారంభించారు. తెల్లారేసరికి ఆశ్రమాన్ని  నేలమట్టం  చేశారు. ఎవరైనా  అడ్డుకుంటారనే  ఉద్దేశంతో టైట్ సెక్యూరిటీ  ఏర్పాటు చేశారు.