కరెంటు కేబుల్స్ అడ్డంగా ఉందని... వందల ఏండ్ల చెట్టును నరికేసిన్రు

కరెంటు కేబుల్స్ అడ్డంగా ఉందని...  వందల ఏండ్ల చెట్టును నరికేసిన్రు

గండిపేట, వెలుగు: ఒక వైపు ప్రభుత్వం చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తుంటే కొందరు అధికారులు అనాలోచిత నిర్ణయాలతో వందల ఏండ్ల నాటి చెట్లను నరికివేస్తున్నారు. 

బండ్లగూడ జాగీరు పరిధిలోని హిమాయత్‌‌సాగర్​లో లార్డ్స్‌‌ ఇంజినీరింగ్‌‌ కాలేజీకి వెళ్లే దారిలో కరెంట్‌‌ కేబుల్స్​కు అడ్డంగా ఉందని భారీ చెట్టును విద్యుత్‌‌ అధికారులు నరికి వేశారు. పర్యావరణ ప్రేమికులు అధికారులను ప్రశ్నించినప్పటికీ వారు పట్టించుకోకుండా చెట్లు నరికి వేశారు.