మల్లారెడ్డికి మరో షాక్. .చెరువును ఆక్రమించారంటూ 7 ఏకరాల్లో గోడ కూల్చివేత

 మల్లారెడ్డికి మరో షాక్. .చెరువును ఆక్రమించారంటూ 7 ఏకరాల్లో గోడ కూల్చివేత

మేడ్చల్ జిల్లా: మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. చెరువులో 7 ఏకరాలు ఆక్రమించారంటూ రెవెన్యూ అధికారులు ప్రహరీ గోడను కూల్చివేశారు. 

 శామీర్ పేట మండలంలోని బొమ్మరాసిపెట గ్రామంలోని పెద్ద చెరువు ఎఫ్టిఎల్ , బఫర్ జోన్ లలో మల్లారెడ్డి చెరువును ఆక్రమించారని పలువురు.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో   మల్లారెడ్డి  నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. సుమారు 25 ఎకరాల ఎఫ్టిఎల్ స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడలను తొలగించారు.  అందులో  మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 408లో 7 ఎకరాల ప్రహరీ గోడను  అధికారులు జేసీబీ సాయంతో కూల్చివేశారు.

ALSO READ | పాలు, పూలు అమ్ముడే కాదు..మల్లారెడ్డి భూ కబ్జాలు చేసిండు: బాధితులు

 ఇటీవల కుత్చుల్లాపూర్ సుచిత్రలో సర్వేనెంబర్ 82,83 లో మాజీమంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూవివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే మల్లారెడ్డి ఆయన అల్లుడు రెండున్నర ఎకరాలు తనదేనని వాస్తున్నారు.అయితే ఇందులో 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు.