రాజన్న హుండీ ఆదాయం రూ.71.80 లక్షలు..

రాజన్న హుండీ ఆదాయం రూ.71.80 లక్షలు..

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామి హుండీలను బుధవారం లెక్కించారు. 25 రోజులకు గాను రూ.71.80 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 35 గ్రాముల బంగారం, 3.100 కిలోల సమకూరిందని చెప్పారు. హుండీ లెక్కింపును ఆలయ ఈవో ఎల్.రమాదేవి,  కరీంనగర్  ఏసీ ఆఫీస్  ఇన్స్​పెక్టర్  రాజమౌళి పర్యవేక్షించారు. అలాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దత్తత ఆలయమైన నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ 9 నెలల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.15.47 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.