సోషల్మీడియా ఖాతాలు పరిశీలించాకే పాస్పోర్టు ఇస్తాం

సోషల్మీడియా ఖాతాలు పరిశీలించాకే పాస్పోర్టు ఇస్తాం

ప్రజలు సోషల్మీడియాలో చేసే పోస్టులు..వారికి  పాస్పోర్టు ఇవ్వాలా..? వద్దా..? అనే విషయాన్ని డిసైడ్ చేయనున్నాయి. సోషల్ మీడియా కట్టడిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పాస్పోర్టు రూల్స్లో అధికారులు పలు మార్పులు చేశారు. ఇకపై సోషల్మీడియా ఖాతాలు పరిశీలించాకే పాస్పోర్టు మంజూరు చేయాలని నిర్ణయించారు. పాస్పోర్టు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు వెరిఫికేషన్ చేసే ప్రక్రియలో భాగంగా వారి సోషల్ మీడియా ఖాతాలను సైతం పోలీసులు పరిశీలించనున్నారు. దేశానికి సంబంధించి అభ్యంతరకర పోస్టులు లేకపోతేనే పాస్పోర్టు మంజూరు చేస్తామని రీజినల్ పాస్పోర్టు ఆఫీసర్ అబ్దుల్ సయ్యద్ తెలిపారు. దేశ ద్రోహానికి సంబంధించిన పోస్టులు ఉంటే మాత్రం వారికి పాస్పోర్టు ఇవ్వమని స్పష్టం చేశారు.

కాగా దేశద్రోహం ఆందోళనలు, నిరసనల చర్చలకు సోషల్మీడియా వేదికగా నిలుస్తోంది. దీనిని కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాస్పోర్టు పొందడం అంత సులువైన విషయమేమి కాదు. అభ్యర్థులు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తారు. పోలీసులు ఒకే అంటేనే పాస్పోర్టు మంజూరు అవుతుంది. లేకపోతే వారికి పాస్పోర్టు ఇవ్వరు.