JNTUH పరిధిలోని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్

JNTUH పరిధిలోని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్

JNTUH పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీలలో బయోమెట్రిక్ అటెండెన్స్ ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులు మరోసారి అదేశాలు జారీ చేశారు. గతంలోనే అదేశాలు ఇచ్చి మళ్ళీ రెండో సారి అదేశాలు ఎందుకు ఇస్తున్నారని టెక్నికల్ ఎంప్లాయిస్  అసోసియేషన్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

 

కేవలం ఆర్డర్ ఇవ్వటమే కానీ దాని అమలుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కాగితాలపై కాకుండా ప్రత్యక్షంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక విద్య బలోపేతం చేయాలని టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.