
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ఇరిగేషన్ డెవలప్మెంట్కార్పొరేషన్(ఐడీసీ) పరిధిలో కొత్తగా 35 లిఫ్ట్ స్కీములకు అధికారులు ప్రపోజల్స్సిద్ధం చేశారు. శుక్రవారం ఐడీసీ ఆఫీసులో చైర్మన్ వేణుగోపాలాచారి అధ్యక్షతన బోర్డు మీటింగ్ నిర్వహించారు. కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులపై చర్చించారు. ఎత్తయిన ప్రాంతాలకు నీటిని అందించడానికి మరికొన్ని లిఫ్టుల నిర్మానం కోసం ప్రపోజల్స్ వచ్చాయని, వాటిని సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని వేణుగోపాలాచారి వెల్లడించారు.
2022 – 23 ఆర్థిక సంవత్సరానికిగాను ఐడీసీకి రూ.269.54 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. అందులో భాగంగా చేపట్టిన 538 లిఫ్ట్స్కీములతో 4.69 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందని వివరించారు. రూ.743.19 కోట్లతో చేపట్టిన ఇంకో 37 స్కీములు పనులు కొనసాగుతున్నాయని..అవి పూర్తయితే ఇంకో 65 వేల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్స్పెషల్సీఎస్రజత్కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ఎం) నాగేందర్రావు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్పండిట్మడ్నూరే, ఐడీసీ ఎండీ విద్యాసాగర్, బోర్డు మెంబర్లు లత, వినోద్ పాల్గొన్నారు.