ఆర్‌‌బీఐ ఆధ్వర్యంలో విజయవంతంగా 2కె రన్‌ .. ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు

ఆర్‌‌బీఐ ఆధ్వర్యంలో విజయవంతంగా 2కె రన్‌ .. ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ)  ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో  ఉదయం 2 కెరన్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా లీడ్​ బ్యాంక్​ మేనేజర్​ భాస్కర ప్రసాద్​, ఇన్‌చార్జి​ డీఆర్‌‌ఓ రమేశ్‌​ రాథోడ్ 2కె రన్​ క్రీడా జ్యోతిని వెలిగించి రన్​ప్రారంభించారు.  పట్టణంలోని ప్రధాన రహదారిలో నిర్వహించిన రన్​లో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. 

నస్పూర్, వెలుగు: ఆర్థికాభివృద్ది సాధించడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు చేపట్టిన 2కె రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, వివిధ బ్యాంకుల అధికారులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.