- ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: అటవీ సంరక్షణలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ఆమె సెక్రటేయెట్ లో రాష్ట్ర అటవీ జూనియర్ అధికారుల సంఘం క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అటవీ పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎంకు తెలియజేసి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సురేఖ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో అటవీ అధికారుల సంఘం అధ్యక్షుడు నాగేంద్రబాబు, ఉపాధ్యక్షుడు సాంబు నాయక్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుకన్య, ట్రేజరర్ కోటేశ్వర రావు పాల్గొన్నారు.
